బంపర్ ఆఫర్.. 5 లక్షలు కడితే 40 లక్షలు లాభం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సూపర్ స్కీం..

-

ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టాలు పడుతున్నారు. సంపాదించిన దాంట్లో భవిష్యత్తు కోసం ఆలోచించి కొంత డబ్బు పొదుపు చేయాలని చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఈరోజుల్లో పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలున్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా.. మంచి రాబడులు వచ్చే స్కీమ్స్ లో నగదును పొదుపు చేయాలని చాలా మంది చూస్తారు. మరి, అలాంటి వాటిలో ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన పోస్టాఫీస్ స్కీమ్స్ చాలా బెస్ట్ అనే చెప్పావచ్చు. ఎందుకంటే.. ఈ పోస్టాఫీసు స్కీమ్స్ లో ఎటువంటి రిస్క్ ఉండదు. పైగా పెట్టిన పెట్టుబడుల్లో డబుల్ పెట్టుబడులు అందించే స్కీమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.

పోస్టాఫీసులో డబులు పెట్టుబడి కావలనుకునే వారికి మరో కొత్త స్కీమ్ అనేది అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా పోస్టాఫీసు ద్వారా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల వారి కోసం కొన్ని మంచి మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, రిటైర్మెంట్ ఫండ్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలే ఉన్నాయి.

అయితే అలాంటి వాటిలో లాంగ్ టర్మ్ లో అద్భుతమైన రాబడి అందించే మరో పథకం కూడా ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర. ఇక ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా ఇందులో గ్యారెంటీ రిటర్స్ కూడా వస్తాయి. ఇంకా అంతేకాకుండా.. దీంట్లో ఎంత పెట్టుబడి పెట్టినా కూడా సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతాయి. అయితే ఈ పథకంలో కనీస రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇందులో గరిష్టంగా ఎంతైనా కూడా పెట్టుబడి పెట్టవచ్చు.ఎలాంటి పరిమితి లేదు.

ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో సింగిల్ అకౌంట్ కూడా తెరవచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరుచుకోవచ్చు. ఈ స్కీమ్ లో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.50 శాతంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఓసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ఇందులో వడ్డీ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు. స్థిరంగా కూడా ఉండొచ్చు.ఇక ఈ పథకంలో మీరు 115 నెలలు, 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసుకోవచ్చు. అంటే రూ. లక్ష పెట్టుబడి పెడితే నిర్దిష్ట వడ్డీ ప్రకారం.. ఇంత కాలంలో అది రూ. 2 లక్షలవుతుంది. అలాగే రూ.5 లక్షలు పెడితే.. అది కాస్త రూ.10 లక్షలుగా, రూ.20 లక్షలు పెడిగే రూ.40 లక్షలుగా డబ్బు డబుల్ అవుతుంది.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి అసలు ఎలాంటి రిస్క్‌కు అవకాశమే లేదు. పైగా చిన్న మొత్తంలోని డిపాజిట్లతో ఈ స్కీమ్ లో మీరు చేరవచ్చు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c టాక్స్ బెనిఫిట్స్ ఈ స్కీంలో లేవు. మెచ్యూరిటీ నగదు మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక అకౌంట్ హోల్డర్ చనిపోవడం, ఇతర ఏదైనా సందర్భాల్లో కోర్డ్ ఆర్డర్‌ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన రెండేళ్ల 6 నెలల తర్వాత ముందుగానే దీని నుంచి వైదొలగవచ్చు. మీరు ఈ స్కీమ్ కింద లోన్ కూడా తీసుకోవచ్చు.బ్యాంకులు , పోస్టాఫీసుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ దీనికి అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news