పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నల్ల కండువా కప్పుకొని అసెంబ్లీకి బయలుదేరారు జగన్. జగన్ తో పాటు అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. నల్ల కండువా కప్పుకొని మరీ అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చిన క్రమంలో వైసీపీ నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేశారు.
దీంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉండాలంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని, ఆగ్రహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు జగన్.