రూ.299కే రూ.10 లక్షలు… పూర్తి వివరాలు ఇవే..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరిగింది. ఆరోగ్య బీమా పాలసీలు ని చాలా మంది తీసుకుంటున్నారు. దీనితో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకి వచ్చేయచ్చు. వయసు ప్రతిపాదికన ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం మారుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ఎక్కువ ఉండడంతో చాలా మంది తీసుకోవడం లేదు. కానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇస్తున్న ఈ పాలసీ ని పక్కా చూడాల్సిందే.

కస్టమర్ల కోసం స్పెషల్ గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ పాలసీ ని తీసుకొచ్చింది. వార్షిక ప్రీమియం కేవలం రూ.299, రూ.399 తోనే ఏకంగా రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ ని అందిస్తోంది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దీన్ని తీసుకోవచ్చు. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణించినా లేదంటే శాశ్వత అంగ వైకల్యం వచ్చినా రూ.10 లక్షలు పోస్టల్ బ్యాంక్ ఇస్తుంది. దీన్ని ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షలు ని పొందవచ్చు. ఒకవేళ వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఇన్‌ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కింద రూ. 60 వేలు వస్తాయి. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ విషయంలో రూ. 30 వేలు ఇస్తారు. విద్యా ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకోసం రూ.399 కట్టాలి. అప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news