రూ.1699 కట్టి ఇలా టూ వీలర్ ని పొందండి…!

-

మీరు కొత్త ద్విచక్ర వాహనాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఓ అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనితో మీరు తక్కువ ధరకే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

బూమ్ మోటార్స్ తాజాగా కొత్త టూవీలర్‌ను ఇండియన్ మార్కెట్‌ లోకి తీసుకు వచ్చింది. దీని పేరే బూమ్ కార్బెట్. అయితే దీనిలో రెండు వేరియంట్స్ వున్నాయి. కార్బెట్ 14, కార్బెట్ 13 ఈఎక్స్ అనేవి వీటి పేర్లు. కార్బెట్ 14లో అయితే 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, కార్బెట్ 14 ఈఎక్స్‌ లో అయితే 4.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

కార్బెట్ 14 వేరియంట్ అయితే ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలో మీటర్లు వెళ్తుంది. అదే కార్బెట్ 14ఈఎక్స్ అయితే ఒక్క సారి చార్జ్ చేస్తే 200 కిలో మీటర్లు వెళ్తుంది. ఛార్జ్ అవ్వడానికి 2.5 గంటల నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది.

ఇక వీటి ధర వివరాల లోకి వెళితే.. కార్బెట్ 14 ధర రూ.89,999గా ఉంది. ఇక కార్బెట్ 14ఈఎక్స్ ధర రూ.1,24,999. ఈఎంఐ లో దీనిని కొనచ్చు. ఈఎంఐ నెలకు రూ.1699 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఐదేళ్లు పే చేస్తూ టూ వీలర్ ని సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news