గత ఏడాది కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వచ్చిన నేపథ్యంలో తాము వ్యవసాయ చట్టాలను వెనక్కి.. తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే దీనిపై ఇప్పటికే సోను సూద్, తాప్సీ లాంటివారు మోడీ నిర్ణయాన్ని ఆమోదించారు. అయితే వివాదాస్పద నటి కంగనా రనౌత్ మాత్రం కేంద్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యింది. నిద్రావస్థలో ని దేశానికి నియంతృత్వం సరైందంటు తన సోషల్ మీడియాలో పేర్కొంది. “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను… రోడ్డెక్కిన కొందరు నిర్దేశిస్తూ ఉంటే… అది కూడా మరో జిహాదీ దేశం అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు” అంటూ కంగనారనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.