Don’t Miss 50 రూపాయలతో రూ. 35 లక్షలు..! పోస్ట్ ఆఫీస్ స్కీమ్..

-

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా రిస్క్ ఉండదు. తక్కవ అమౌంట్ అయినా సరే ఇన్వెస్ట్ చెయ్యచ్చు. మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ అమౌంట్ వస్తాయి. అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని మీరు అనుకుంటే గ్రామ్ సురక్ష పథకం బాగుంటుంది. రిస్క్ ఏమి ఉండదు.

మంచి రిటర్న్స్ ని ఈ స్కీమ్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే… రోజుకు రూ. 50 చొప్పున ఇందులో రూ.1500 కట్టుకుంటూ వెళితే మెచ్యూరిటీ సమయానికి రూ. 31 నుంచి 35 లక్షల వరకు పొందేందుకు అవుతుంది.

ఇక ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చెయ్యచ్చు అనేది చూస్తే.. 19 నుంచి 55 ఏళ్ల వయస్సు వున్నవాళ్లు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. రూ. 10 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో పెట్టచ్చు. అయితే ఎంత అమౌంట్ పెట్టచ్చు అనేది పూర్తిగా మీ ఇష్టం. ప్రీమియమ్స్ ని నెలకి కానీ 3 నెలలు, 6 నెలలు వారీగా, ఏడాదికి కూడా కట్టొచ్చు.

దీన్ని కట్టేందుకు 30 రోజుల రిలాక్సేషన్ పీరియడ్ వుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టేవాళ్ళు లోన్ కూడా పొందొచ్చు. స్కీమ్‌ లో జాయిన్ అయిన మూడేళ్ల తర్వాత కూడా పాలసీని ఉపసంహరించుకోవచ్చు. కానీ బెనిఫిట్స్ ని పొందేందుకు అవ్వదు. ఒకవేళ కనుక రూ. 35 లక్షల రిటర్న్స్ ని మీరు పొందాలనుకుంటే రూ. 10 లక్షల పాలసీని ఎంచుకోవాలి.

19 ఏళ్ల వయసు వుండే వ్యక్తి నెలకు రూ. 1515 చొప్పున కడుతూ ఉండాలి. 36 సంవత్సరాలకు రూ.31.60 లక్షలు పొందొచ్చు. రూ.1463 చొప్పున కడితే 58 ఏళ్లకు రూ.33.40 లక్షలకు వెళ్తుంది. రూ.1411 చొప్పున కడితే 60 ఏళ్ల వయసు కి రూ.34.60 లక్షలు వస్తాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news