కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్నో పథకాలు ద్వారా నిరుపేదలు, మహిళలు, యువకులు ప్రయోజనాలను పొందుతున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని, నైపుణ్యతను మరియు ఇతర ప్రయోజనాలను పొందుతున్నారు. వీటితో పాటుగా వృద్ధాప్యంలో ఆర్థిక సహాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి. ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదే ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పూర్తి అయ్యి వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరైతే ఆదాయాన్ని కోల్పోతారో వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
అర్హత వివరాలు:
ఈ పథకానికి 60 ఏళ్లు లేక అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ ప్రధానమంత్రి వయ వందన యోజన పథకానికి దరఖాస్తు చేసుకునేవారు 15 లక్షల వరకు పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పాలసీ గడువు 10 సంవత్సరాలు. ఈ పథకానికి సంబంధించిన పాలసీను ఆన్లైన్ లేక ఆఫ్లైన్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పథకం కు సంబంధించి వడ్డీ రేటు 7.4% వరకు ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్ లు కంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఎక్కువ వడ్డీని పొందవచ్చు. పైగా ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు లేక నెల చొప్పున పెన్షన్ పొందే విధంగా దీనిని రూపొందించారు. ఈ విధంగా పెన్షన్ ఆప్షన్ ను ఎంపిక కూడా చేసుకోవచ్చు. దాని ప్రకారం వడ్డీ రేటు అనేది ఉంటుంది. ప్రధానమంత్రి వయ వందన యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకం లో పెట్టుబడి చేయడం వలన ప్రతి నెల 18 వేలకు పైగా పొందవచ్చు. ఈ పథకంలో చేరిన తర్వాత మరణిస్తే పెట్టుబడి మొత్తాన్ని నామినీకి అందించడం జరుగుతుంది మరియు మూడు సంవత్సరాలు ఈ పథకంలో పెట్టుబడి చేస్తే రుణాలను కూడా పొందవచ్చు.