దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ సీరియస్‌ !

-

ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై కీలక ప్రకటన చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సభ్యులు ఎవరికీ కనిపించకుండా దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆగ్రహించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

Speaker Ayyannapatrudu makes key announcement on members’ attendance in AP Assembly

వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాథ్ రెడ్డి, విశ్వేశర రాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని నిప్పులు చెరిగారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవొద్దని కోరుతున్నామని తెలిపారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అయితే.. అసెంబ్లీ సభ్యలను దొంగలు అనడంపై వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news