ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో నెల నెలా రూ.2500 పొందొచ్చు..!

-

మీరు ప్రతీ నెలా డబ్బులని పొందాలనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అలాగే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పోస్టాఫీస్‌లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

Postoffice
Postoffice

పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చాలా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా మీకు చక్కగా ప్రతి నెలా కూడా డబ్బులు వస్తాయి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తారు. కనీసం రూ.1000 నుంచి డబ్బులు పెట్టొచ్చు.

మీరు ఈ స్కీమ్ కింద గరిష్టంగా ఒక ఖాతాలో రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనితో మీకు నెలకి రూ.2475 వస్తుంది. అదే ఒకవేళ కనుక మీరు జాయింట్ అకౌంట్ తీసుకుంటే రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ముగ్గురు కలిసి కూడా ఖాతా తెరిచే అవకాశం కూడా వుంది. ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు.

అంటే ఐదేళ్ల వరకు డబ్బులు తీసుకోవడానికి వీలుండదు. కొన్ని సందర్భాల్లో కావాలంటే డబ్బులని వెనక్కి తీసుకొచ్చు. అలా చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది. అంటే వచ్చే రాబడి తగ్గిపోతుంది. అందుకే ఒక్కసారి డబ్బులు పెడితే ఐదేళ్ల వరకు ఆ డబ్బులని అలా ఉంచితే బెస్ట్. ఈ స్కీమ్ లో చేరాలంటే పోస్టాఫీస్ కి వెళ్ళి చేరచ్చు. ఆ తర్వాత ఈ ప్రయోజాలన్నింటినీ కూడా పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news