LIC Dhan Vridhhi : సింగిల్‌ ప్రీమియం ఎల్‌ఐసీ ప్లాన్‌.. సెప్టెంబర్‌ 30 వరకే గడువు

-

శాలరీ కొంచెం పెరిగింది, అయినా వచ్చిన డబ్బు అంతా నెలాఖరు వచ్చేసరికి ఖర్చు అయిపోతుంది. ఏది అవసరమైన ఖర్చో, ఏది అనవసరమైనదో తెలియకుండా జేబు ఖాళీ అవుతుంది. 20 వేలు జీతం వచ్చినప్పుడు ఎలా ఉందో.. 40 వస్తున్నా అలానే ఉంది.. ఏదో ఒక సేవింగ్‌ స్కీమ్స్‌లో జాయిన్‌ అవ్వాలి అని అనుకుంటున్నారా..? చాలామంది శాలరీ పెరిగాక..చిట్టీలు వేస్తారు. లక్ష, రెండు లక్షలు చిట్టీలు వేసుకుని నెలకు ఇంత అని కడుతుంటారు. ఇవి అంత సురక్షితం కాదు, లాభం అంత కంటే కాదని చాలామంది అంటున్నారు. మీరు ఏదైనా ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటే.. ఈ బెస్ట్‌ పాలసీ మీకోసమే. ఇంకా దీని గడువు తేదీ కూడా సెప్టెంబర్ 30 వరకే ఉంది.

కొత్తగా ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునే వారికి అలర్ట్. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి (LIC Dhan Vridhhi) పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీని పరిచయం చేసింది. ఈ పాలసీ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండదు. ఈ పాలసీ 2023 సెప్టెంబర్ 30 వరకే తీసుకోవచ్చు. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో సేవింగ్స్‌తో పాటు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.

పాలసీ గడువులో జీవిత బీమా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే అతని కుటుంబానికి ఈ ప్లాన్ ఆర్థికంగా మద్దతునిస్తుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో హామీ ఇవ్వబడిన మొత్తాన్ని పాలసీదారులకు అందిస్తుంది. ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్ కాబట్టి, భవిష్యత్తులో ప్రీమియం చెల్లించాలని, ల్యాప్స్ అవుతుందని టెన్షన్ ఉండదు.

ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలనుకునేవారి వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్‌లో 10 ఏళ్లు, 15 ఏళ్లు, 18 ఏళ్ల టర్మ్ అందుబాటులో ఉంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,25,000. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీ తీసుకున్నవారికి బెనిఫిట్స్ విషయంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి.

ఆప్షన్ 1 ఎంచుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ 1.25 రెట్లు ఉంటుంది. చెల్లించిన ప్రీమియం కన్నా 1.25 రెట్లు డెత్ బెనిఫిట్ లభిస్తుంది. ఇక రెండో ఆప్షన్ ఎంచుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ 10 రెట్లు ఉంటుంది. చెల్లించిన ప్రీమియం కన్నా 10 రెట్లు డెత్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీహోల్డర్‌కు బెనిఫిట్‌తో పాటు గ్యారెంటీ అడిషన్స్ కూడా లభిస్తాయి.

ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఉదాహరణ చూస్తే 36 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల టర్మ్‌తో ఆప్షన్ 1 ఎంచుకొని రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. రూ.8,16,720 ప్రీమియం చెల్లించాలి. ఆప్షన్ 1 ఎంచుకునేవారికి డెత్ బెనిఫిట్ రూ.11.6 లక్షల వరకు లభిస్తుంది. ఒకవేళ ఆప్షన్ 2 ఎంచుకుంటే రూ.9,00,184 ప్రీమియం చెల్లించాలి. డెత్ బెనిఫిట్ రూ.87.9 లక్షలు లభిస్తుంది.

పాలసీ హోల్డర్స్‌కు పలు రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ ఇన్స్యూరెన్స్ రైడర్ లాంటి రైడర్స్ ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version