సహజంగా దూర ప్రయాణాలను చేసినప్పుడు దేశవ్యాప్తంగా టోల్ గేట్ ల వద్ద టోల్ పేమెంట్లను చేయాల్సి ఉంటుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా కొత్త టోల్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. దీనిలో భాగంగా వన్ టైం పేమెంట్ వ్యవస్థ ను అమలు చేసే విధంగా ప్రతిపాదనలు చేసింది. అయితే దానిలో భాగంగా ఒక్కసారి పేమెంట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్ లు అయినా ప్రయాణించవచ్చు. దీనివలన ప్రతిసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త టోల్ పాలసీ ప్రకారం, వాహనదారులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి.
అదే యాన్యువల్ పాస్ మరియు డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్. ప్రతి సంవత్సరం ఒకసారి మూడువేల రూపాయలతో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. జాతీయ రహదారి, రాష్ట్ర ఎక్స్ప్రెస్ వే ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. కేవలం పాస్‌కి సంబంధించిన ఫాస్ట్ టాగ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అదే విధంగా, లైఫ్‌టైమ్ పాస్‌ను కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 30 వేల రూపాయలు కట్టడం వలన, 15 ఏళ్ల పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చు.
కాకపోతే దీని పై ఎటువంటి అప్డేట్ ప్రభుత్వం నుండి రాలేదు. కేవలం మాన్యువల్ పాస్ పాలసీ గురించి కొన్ని వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే వాహనదారులు వరుసగా ఫాస్ట్ టాగ్ రీఛార్జ్ చేసుకుంటారో ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. అయితే, దానికి బదులుగా రెండు పాలసీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అదే వాహనదారులు ప్రయాణించిన ప్రతి 100 కిలోమీటర్లకు 50 రూపాయలను కట్టే విధంగా ప్రయత్నిస్తోంది. కాకపోతే ఇది కొత్తగా అమల్లోకి వస్తున్న సాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్‌లో భాగం అని ప్రభుత్వం చెప్పింది.