పీఎం స్వనిధి : వారి అకౌంట్లోకి నేరుగా రూ.10 వేల రుణం..!

-

కరోనా మహమ్మారి వలన చాలా మంది నష్టపోయారు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరో సారి కరోనా వైరస్ రావడంతో మళ్ళీ ఇబ్బందులు తప్పలేదు. అందుకే కరోనాతో ఇబ్బందులు పడుతోన్న వీధి వర్తకులకు నేరుగా వారి అకౌంట్లోకి రూ.10 వేలను ఇవ్వనున్నారు. పీఎం స్వనిధి పథకం పేద, ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్రం తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ పధకం కింద వీధి వర్తకులు రూ.10 వేల వరకు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. అలానే తీసుకున్న మొత్తాన్ని సమయానికి కట్టేస్తే వర్తకులకు, రాయితీలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ స్కీమ్ కింద ప్రయోజనాన్ని పొందాలంటే మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.

ఈ స్కీమ్ ని కేంద్రం 2020 జూన్ 1న ప్రారంభించింది.  దీని యొక్క కాల వ్యవధి 2022 మార్చి వరకు ఉంది. పీఎం స్వనిధి పథకం కింద అర్హులైన వీధి వ్యాపారులు వెబ్‌సైట్ pmsvanidhi.mohua.gov.in ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్బన్ లేదా సెమీ అర్భన్ లేదా గ్రామీణ ప్రాంతాల వారు ఈ లోన్ ని తీసుకున్నట్లయితే ఈఎంఐ పద్ధతుల్లో దీనిని కట్టుకోవచ్చు. ఈ రుణంపై కట్టే వడ్డీపై రాయితీని పొందవచ్చు. సకాలంలో కట్టేస్తే వడ్డీ రేటులో 7 శాతం వరకు సడ్సిడీ వస్తుంది. ఈ వడ్డీ రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లోకి క్వార్టర్లీ లెక్కన ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news