పోస్ట్ ఆఫీస్ నుంచి సూపర్ స్కీమ్.. రూ.500తో మొదలు పెట్టి జాక్ పాట్ కొట్టేయండి..!

-

Post office RD scheme: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలామంది డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. నిజానికి డబ్బులు ఆదా చేసుకోవడం చాలా అవసరం. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి డబ్బులు ఆదా చేయడం నేర్పించాలి. పిల్లల కోసం డబ్బుని ఆదా చేసుకోవడం చాలా అవసరం. రేపు భవిష్యత్తులో పిల్లలు చదువుల కోసం పెళ్లిళ్ల కోసం డబ్బులు అవసరం. అందుకని వాళ్ళ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేస్తూ ఉంటే ఒకేసారి జాక్ పాట్ ని కొట్టొచ్చు. దీని కోసం మీరు ఎక్కువ అదా చేయాల్సిన అవసరం కూడా లేదు. నెలకు 500 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది.

పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే అనేక రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది. వాటిలో ఆర్డీ స్కీమ్ కూడా ఒకటి. ఆర్డీలో మీరు 35000 కంటే ఎక్కువ పొందడానికి అవుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం… పిల్లలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినది ఇందులో పిల్లలు జమ చేసే పిగ్గీ బ్యాంకు డబ్బులకు వడ్డీని కూడా పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ అని కూడా దీన్ని పిలుస్తారు. ప్రతి నెల డబ్బులు జమ చేస్తే మెచ్యూరిటీ మొత్తం వడ్డీతో పాటుగా వస్తుంది.

ఉదాహరణకి నెలకి 500 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ప్లస్ వడ్డీతో కలిపి మీకు 35000 వస్తాయి ఈ పథకం మనకు బ్యాంకులో కూడా అందుబాటులో ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వలన ఐదేళ్లతో పాటుగా అద్భుతమైన వడ్డీని పొందవచ్చు. ప్రతినెలా వంద రూపాయలతో జమ చేయడం మొదలు పెట్టవచ్చు. గరిష్ట డిపోసిట్ పై ఎలాంటి పరిమితి ఉండదు.

ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ పైన 6.7 శాతం వడ్డీ వస్తుంది. పిల్లల కోసం సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తే 5 సంవత్సరాలలో 30 వేలు వస్తాయి. దీనిపైన 6.7 వడ్డీకి 5681 రూపాయలు మెచ్యూరిటీ సమయానికి 35,681. ఇలా చిన్నగా మీరు అమౌంట్ వేసుకుని ఒకేసారి డబ్బుల్ని పొందవచ్చు. ఇంటి వద్ద ఏదైనా పోస్ట్ ఆఫీస్ శాఖ ఉంటే అక్కడికి వెళ్లి మీరు ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. పదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్లు తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news