పెన్షన్ రావాలంటే ఈ సెర్టిఫికెట్ ఉండాలి… ఎలా అప్లై చేయాలంటే..?

-

ప్రభుత్వ సేవలు పొందాలంటే నిర్ణీత సమయంలో అవసరమైన డాక్యుమెంట్లని కచ్చితంగా సబ్మిట్ చేయాలి. లేదంటే సంబంధిత వ్యక్తుల్ని ఆ సేవలు పొందేందుకు అనర్హులుగా పేర్కొంటారు. ప్రభుత్వ పెన్షనర్లు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలన్నా.. పెన్షన్ పొందాలన్నా జీవన ప్రమాణ పత్రం చాలా అవసరం. దీనిని అందజేయాలి. ప్రతి సంవత్సరం నవంబర్లో పెన్షన్లు పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. పెన్షనర్లు ఈ సర్టిఫికెట్ ని బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ల నుంచి పెన్షన్ డిస్టర్బ్ అథారిటీలకు వ్యక్తిగతంగా అందజేయాలి లేదంటే పంపొచ్చు కూడా.

వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్లకు పెన్షన్ ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వ్యక్తిగతంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లక్కర్లేకుండా లైఫ్ సర్టిఫికెట్ ని ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ డేటా ప్రింట్ లేదా స్కాన్ వంటివి చేసి సర్టిఫికెట్ జెనరేట్ చేయొచ్చు. పెన్షనర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించి జనరేట్ అవుతుంది. లైఫ్ సర్టిఫికెట్ ఆన్లైన్లో యాక్సిస్ చేయొచ్చు. ఈ ఏజెన్సీలు పెన్షన్ కొనసాగేలా సర్టిఫికెట్ ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది.

ఈ సర్టిఫికెట్ ని జనరేట్ చేయడానికి ఆధార్ నెంబర్ పెన్షనర్ పేరు పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కావాలి పెన్షన్ డిస్టర్బ్ ఏజెన్సీస్ లో ఆధార్ నెంబర్ తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి. ఇవన్నీ చేయడానికి ముందు సురక్షితమైన అంతరాయం లేని ఇంటర్నెట్ కావాలి. పెన్షనర్లు అధికారిక వెబ్సైట్ నుంచి జీవన్ ప్రమాణ యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. దీని ద్వారా లైఫ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి లేదంటే యాప్ డౌన్లోడ్ చేసినా కనబడుతుంది. ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆధారంగా యాప్ వెర్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ యాప్ తో పెన్షనర్లు లేదా వారి ప్రతినిధులు తమ ఇళ్లల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ని ఈజీగా జనరేట్ చేయొచ్చు అలాగే సబ్మిట్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news