దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల నేపధ్యంలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 80 రూపాయల మార్క్ ని పెట్రోల్ మరోసారి దాటింది. పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 12 పైసలు పెరిగింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.80.54కు చేరగా,
డీజిల్ ధర రూ.75.00కు పెరిగింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు పెరిగిన ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.75.74కు చేరింది. ముంబై పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.81.33కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.79.70 కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గు ముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం తగ్గుదలతో 68.28 డాలర్లకు తగ్గగా ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.96 శాతం క్షీణతతో 62.67 డాలర్లకు తగ్గింది. ఇటీవల గల్ఫ్ దేశాల్లో పరిణామాల నేపధ్యంలో చమురు ధరలు పెరిగాయి.