రోజురోజుకు బంగారం ధర పెరుగుతూ ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.640 పరుగులు పెట్టింది. దీంతో పసిడి ధర రూ.38,960కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరుగుదలతో రూ.42,510కు ఎగసింది. బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా మరింత పెరిగింది. పసిడికి రెట్టింపు స్థాయిలో పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు చేరింది.
ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 ఎగసింది. దీంతో ధర రూ.39,800కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.41,000కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు ఎగసింది.