మీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఈ పద్ధతులని అనుసరించండి..!

-

ఎంత సేపు చదివినా చాల మంది మరచిపోతూ ఉంటారు. పరీక్ష హాల్లో కూర్చున్నాక ఎంత కష్టపడి గుర్తు తెచ్చుకుందామన్నా ఏమి గుర్తుకు రాదు. అయితే మరి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి విజయం సాధించాలంటే ఈ పద్ధతులని అనుసరించాలి. ఈ పద్ధతులని కనుక అనుసరిస్తే తప్పకుండ చదివినవి మీకు గుర్తు ఉంటాయి. మరి ఆ పద్ధతుల గురించి ఇప్పుడే తెలుసుకోండి.

మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కళ్ళ తో చూసిన ప్రతి అంశం మెదడు లో నిక్షిప్తమైపోతుంది. ఉదాహరణకి సినిమా హాలులో చూసిన సినిమా. ఇదే టెక్నిక్‌ను కనుక మనం చదువుతున్నప్పుడు ఎందుకు ఉపయోగించకూడదు..? పుస్తకం లోని అంశాలను దృశ్యాలుగా ఊహించుకొని.. మనసు లో రికార్డు చేసుకుంటే కనుక తప్పక ఈ పద్ధతితో విజయం ఖాయం. పాఠ్య పుస్తకాల్లోని చిత్రాలు, పటాలు ఇలా అన్నింటి పై కనుక శ్రద్ధ చూపితే అంత బాగా గుర్తుండి పోతుంది. ఏవైనా పాఠాల్లో కనుక పిక్చర్స్ లేక పోతే మీరే ఆ పాఠానికి తగ్గ చిత్రాలని ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల బాగా గుర్తుండి పోతాయి ఏమి చదివినా.

మరొక ట్రిక్ ఏమిటంటే… ఎన్‌కోడింగ్‌. ఇది కూడా మంచి పద్ధతే. చదివింది దీర్ఘకాలం పాటు గుర్తుండాలంటే…. ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. అయితే ఈ పద్ధతిని ఎలా పాటించాలి..? ఈ విషయం లోకి వస్తే…. మీరు చదివేటప్పుడు ఏమైనా కీలక పదం కనిపిస్తే అలా గుడ్డిగా చదివేయకుండా నిర్వచనాన్ని చదవడంతో పాటు ఆ నిర్వచనాన్ని అధ్యయనం చేయాలి. ఇలా వివరంగా కనుక చదివితే బాగా గుర్తుండి పోతాయి. కాబట్టి ఈ పద్దతిని కూడా ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగించొచ్చు. అలానే పరీక్షల్లో కూడా సులభంగా అన్ని గుర్తుంటాయి. కాబట్టి ఇలా ఫాలో అయిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news