డోంట్ వర్రీ.. చినిగిపోయిన కరెన్సీ నోట్లు మార్చేసుకోండిలా ..!

మీ వద్ద చినిగిపోయి ఉన్న కరెన్సీ నోట్లు ఉంటే బాధపడొద్దు. వాటిని మీరు సులభంగానే మార్చుకోవచ్చు. దీని కోసం మీరు దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి అక్కడ పాత నోట్లు ఇచ్చి మంచి నోట్లను తీసుకోవచ్చు. మామూలుగా కరెన్సీ నోట్లు అంత స్ట్రాంగ్ ‌గా ఉండవు. అవి సులభంగా నలిగిపోతాయి. ఒక్కోసారి మన టైమ్ బాగోలేకపోతే చినిగిపోతాయి కూడా. ఇలా చినిగిపోయిన నోట్లను లేదంటే బాగా నలిగిపోయిన నోట్లను కొంత మంది తీసుకోరు. ఆలా ఆ నోట్లు మన వద్దనే అలా ఉండిపోతాయి.

సాధారణంగా రూ.10 నోటు లేదా రూ.20 నోటు అయితే ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. అదే అధిక విలువ గల కరెన్సీ నోట్లు చినిగిపోతే మాత్రం మనకి బాధ కలుగుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి విలువ కలిగిన నోట్లు చినిగిపోయిన బాధ పడాల్సిన అవసరం లేదు. చినిగిపోయిన నోట్లకు బదులు కొత్త కరెన్సీ నోట్లను పొందొచ్చు. ఇక్కడ కొత్త కరెన్సీ నోట్లు అంటే బాగా ఉన్న కరెన్సీ నోట్లు అని అర్థం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్లకు చినిగిపోయిన నోట్లకు బదులుగా బాగున్న నోట్లను ఇవ్వాలి. మీరు తీసుకువెళ్లిన నోటు ఫేక్ కాకుండా ఉంటే చాలు. బ్యాంకులు మీ చినిగిపోయిన పాత నోట్లకు బదులు బాగున్న వేరే నోట్లను అందిస్తాయి. ఇదేకాకుండా మీరు ఏ బ్యాంకుకు వెళ్లైనా సరే పాత చినిగిపోయిన నోట్లను మార్చుకోవచ్చు.

నోట్ల మార్పిడికి ఎలాంటి డబ్బులు చెల్లించకర్లేదు. బ్యాంకులు ఎలాంటి రుసుము తీసుకోవు. అంటే ఉచితంగానే మీకు చినిగిపోయిన నోట్లకు బాగున్న నోట్లు లభిస్తాయి. అయితే కొన్ని సార్లు చినిగిపోయిన నోట్లకు బదులు వేరే నోట్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించొచ్చు. అవేమిటంటే.. కరెన్సీ నోట్లు కలిపోయినా లేదంటే బాగా ముక్కలు ముక్కలుగా చిరిగి ఉన్నా, బ్యాంకులు వేరే నోట్లు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆ నోట్లను ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లి డిపాజిట్ చేయాలి.

ఇలా రకరకాలుగా ఉండే నోట్లను ఎలా మార్చుకోవచ్చో తన మార్గదర్శకాల్లో వివరించింది ఆర్బీఐ. కింద ఇచ్చిన టేబుల్స్ ఒకసారి చూడండి.