‘సిప్‌’.. ద బెస్ట్‌ ప్లాన్‌

Join Our Community
follow manalokam on social media

రిటైర్మెంట్‌కు ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్‌ ఇవన్ని సాధనాలే. పెట్టుబడులకు అవకాశం ఉన్నది ఎన్‌పీఎస్‌ ఒక్కటే. రటైర్మెంటుకు సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు, దీనివల్ల భారీలాభాలు ఆర్జించే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎస్‌బీఐ నూతన ఫండ్‌

రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం ప్రత్యేకంగా ఎస్‌బీఐ ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎన్‌ఆర్‌బీఎఫ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకంలో ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేసుకునే అవకావం ఉంటుంది. కానీ, ఇందులో పెట్టుబడులు ఐదేళ్లపాటు లాక్‌ అవుతాయి. లేకపోతే 65 ఏళ్లు ఏది ముందైతే అది వర్తిస్తుంది.

కన్జర్వేటివ్‌

ఈ ఆప్షన్‌లో ఈక్విటీ 10వాతం నుంచి గరిష్టంగా 40 శాతం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేయడం జరుగుతుంది.

 

అగ్రెస్సివ్‌ పథకం

దీనిలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈక్విటీలో ఇన్వెస్టు చేస్తుంది. అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఆప్షన్‌లో 65–80 శాతం కేటాయించి, మిగిలిన నిధులను డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల ఇది రిస్క్‌ తక్కువగా ఉంటుంది.

ఇన్సెస్ట్‌మెంట్‌

ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ 50 శాతాన్ని వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్‌ ఎంచుకుని దీర్ఘకాల పాటు ఈ విధానం కొనసాగించే అవకాశముంది. అంటే అధిక భద్రతతో కూడిన డెట్‌ సాధనాలనే ఈ పథకం ఎంచుకుంటుంది. అందులో 4–7 ఏళ్ల వ్యవధి కలిగిన సెక్యూరిటీస్‌ ఎంచుకుంటుంది. ఈ పథకంలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)

దీనిని ఎంచుకుంటే ప్రతి సిప్‌ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్‌ నిబంధన అమలవుతుంది. దీనిలో ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ కూడా ఉంటుంది. కొద్దిగా రిస్క్‌ తక్కువగా ఉండి ఇన్వెస్ట్‌మెంట్లను ఆటోమెటిక్‌గా మార్చడం సులభం. ఈ పథకంలో మీ ఇష్టానుసారం మారిపోవచ్చు, కానీ ఇలా మారితే పెట్టుబడులను వెనక్కితీసుకుని, తిరిగి తాజాగా పెట్టుబడి చేసినట్టు పరిగణిస్తారు. దీనిపై పన్ను పడుతుంది. పనితీరు, లాభాలు ఎలా ఉంటాయో ముందుగా అంచనా వేయలేము. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా సిప్‌ను ఎంచుకోవడం మంచిది.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...