జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడు !

Join Our Community
follow manalokam on social media

అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణ ఏపీ కాబినెట్ అనంతరం మీడియాతో మాట్లాడారు. దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డిలాగా మాట్లాడాడని ఆయన అన్నారు.

ఇలాగే మాట్లాడితే అనంతపురం ప్రజలు మీ నాలుక కోసేస్తారని అన్నారు. చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న మంత్రి రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేసి 420 గా ముద్ర పడిన వ్యక్తి చంద్రబాబని అన్నారు. దివాకరరెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని దివాకరరెడ్డి కుటుంబ అకృత్యాలు గురించి తాడిపత్రిలో అందరికీ తెలుసని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఏడాదిన్నరలో 70 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని అన్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...