అవునండి, నిజమే! ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేశాల్లో సూర్యుడు అస్తమించడు. మనం గడియారాన్ని చూస్తే తప్ప ఇక్కడ పగలేదో? రాత్రేదో? తెలియడం కష్టం. అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశవంతమైన వెలుగుతో దర్శనమిస్తాడు. ఇక్కడి ప్రజలు రాత్రి 12 గంటల తర్వాత కూడా తమ పనులను చేసుకుంటు ఉంటారు.
అదే మన దేశంలో 12 సగం రోజు సూర్యుడికి, మరో సగం చంద్రుడికి సమానంగా పాలిస్తారు.
మన ఇష్ట దైవాల్లో సూర్యుడు ఒకడు. ఈయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో దాదాపు అన్ని పండగల్లో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి రోజు కూడా ఉదయం స్నానం ఆచరించిన వెంటనే మన ఇష్ట దైవాన్ని పూజించడానికి ముందుగా మనం దర్శనం చేసుకునేది ఆ సూర్య భగవాణుడిని.
కెనడా
కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఏడాది మొత్తం దర్శనమిస్తాడు. ఇనువిక్, వాయువ్య భూభాగంలో ఏడాదికి 50 రోజులు ఉంటుంది. అందుకే ఇక్కడ గ్రేట్ నార్తర్న్ ఫెస్టివల్ చేసుకుంటారు.
స్వీడన్
స్టాక్‌హఓమ్‌లో హాఫ్‌మూన్‌ను చూసే అదృష్టం లభిస్తుంది. ఇక్కడ రాత్రి 12 గంటల వరకు సూర్యుడు ఉదయించి, తెల్లవారుజామున 4.30 గంటలకు అస్తమిస్తాడు. ఈ ప్రదేశంలో పర్యటించేవారు రాత్రి బోటింగ్ అద్భుతంగా ఉంటుంది.
స్టాక్ హోమ్‌లో మొత్తం 14 ద్వీపాలు ఉంటాయి. మలారిన్ సరస్సు బాల్టిక్ సముద్రాన్ని కలిసే ప్రదేశం ఉంటుంది. స్టాక్ హోమ్ ప్రాంతం 30 శాతం నీటితో నిండి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం పర్యాటకులు వస్తారు. ఈ ప్రాంతంలో చూడాల్సిన అద్భుతమైన పర్యటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి.
స్కాన్సెన్ అనే పట్టణం సాంప్రదాయ గృహాలతో 19వ శతాబ్దం నాటి స్వీడన్ ప్రతిరూపంగా ఈ పట్టణం నిర్మించారు. ప్రపంచ అతి పురాతన మ్యూజియం ఉంది. అర్ధరాత్రి కూడా సూర్యున్ని ఆస్వాదించవచ్చు.