ఉన్నత చదువులు చదవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ లోన్ కే వెళ్తూ ఉంటారు. విదేశీ విద్య, మన దేశంలో ఉన్న ఉన్నత విద్యాలయాల్లో విద్యను అభ్యసించడానికి గాను ఎక్కువగా రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీనితో బ్యాంకులు కూడా ఎక్కువ ఆఫర్లు ఇస్తూ తక్కువ వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాయి. అంత వరకు బాగానే ఉంటుంది గాని తర్వాత తర్వాత బ్యాంకులు చుక్కలు చూపిస్తాయని అంటున్నారు అనుభవం ఉన్న వాళ్ళు.
లోన్ ఎప్పుడైతే కట్టడం మొదలుపెడతారో అప్పటి నుంచి ఈఎంఐలను జాగ్రత్తగా కట్టాలి. ఏ నెలది ఆ నెల కట్టుకుంటూ వెళ్తేనే మంచిది. ఈ నెలది వచ్చే నెల కడితే మీకు చార్జెస్ రూపంలో మోత మోగిపోతుంది. ఇక సిబిల్ స్కోర్ అనేది కూడా పడిపోవడమే కాకుండా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు ఎదురు కావడం అంటే ఆ లోన్ వలన సిబిల్ స్కోర్ పడిపోతే మీకు ఋణం పుట్టే అవకాశం ఉండదు.
మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు త్వరగా తీర్చుకోవడమే చాలా మంచిది. ఉదాహరణకు మీరు రెండు లక్షలు తీసుకుని 140 ఈఎంఐలు పెడితే నెలకు మీరు 3 వేలు కడుతూ ఉంటె… మీరు లోన్ పూర్తి అయ్యే సరికి కట్టేది నాలుగు లక్షల వరకు ఉంటుంది. ఒక విద్యార్ధి 1,68,000 ఋణం తీసుకున్నాడు. ఇప్పటి వరకు 25 ఈఎంఐలు మూడు వేల వరకూ కట్టగా ఇంకా 115కి పైగా ఉన్న ఈఎంఐలతో తీర్చాల్సిన మొత్తం రెండు లక్షలకు పైగానే ఉంది. కాబట్టి డబ్బులు ఉంటే ఒక్కసారే తీర్చుకోవడం ఉత్తమం.