8 రోజుల కాశీ టూర్… ఈ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు..!

-

కాశీ వెళ్లాలని అనుకుంటే ఇది బెస్ట్ ప్యాకేజీ. కాశీ వెళ్లాలని అనుకునే వాళ్ళు ఈ ప్యాకేజీ తో ఈ ప్రదేశాలని కవర్ చేసి వచ్చేయచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిజం కాశీ యాత్రకు టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ టూర్‌లో భాగంగా కాశీతో పాటుగా పలు ఇతర ప్రాంతాలను కూడా చూసేసి వచ్చేచ్చు. ఇక ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఇది సెప్టెంబర్ 26న ప్రారంభం అవ్వనుంది. 7 రాత్రులు/8 రోజులు ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా ఈ ప్రాంతాలు అన్నీ కూడా కవర్ అవుతాయి.

- Advertisement -

గయా విష్ణు పాద టెంపుల్, వారణాసిలో కాశీ విశ్వనాథుడి దేవాలయం, గంగా హరతి తో పాటు ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం ఇవన్నీ కూడా చూడవచ్చు. ఈ ప్యాకేజీని కనుక బుక్ చేసుకుంటే సికింద్రాబాద్, ఖాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట, పెందుర్తి, విజయనగరం, పలాస స్టేషన్స్ లో ట్రైన్ ఎక్కవచ్చు.

ఈ ప్రదేశాలన్నీ కవర్ చేసేసి రావచ్చు. ఇక ధర చూస్తే.. డబుల్ / ట్రిపుల్ షేరింగ్ ఎకానమీ క్లాస్ ని తీసుకుంటే రూ. 13,900 నుంచి ప్రారంభం కానుంది. స్టాండర్డ్ కేటగిరి ని చూస్తే రూ. 22,300 పడుతుంది. ఇక కంఫర్ట్ కేటగిరిలో అయితే రూ. 29,300 చెల్లించాలి. పిల్లలకి రేటు వేరేగా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...