క్రూయిజ్ జర్నీ చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నారా..? అయినా వేరే దేశాలకి ఏం వెళ్తాములే అని లైట్ తీసుకున్నారా..? అయితే కచ్చితంగా ఇది చూడాల్సిందే. మన ఇండియా లోనే క్రూయిజ్ జర్నీ చేసొచ్చేయచ్చు. ఏ విదేశాలకో వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎక్కువ డబ్బులైపోతాయనే బాధా వద్దు. ఇలా జర్నీ చెయ్యడం ఎంతో బాగుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం చక్కగా చూడచ్చు. అలానే పబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ మొదలు ఎన్నో ఉంటాయి. లగ్జరీ క్రూయిజ్‌లో ఒకసారి ప్రయాణం చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక మరి పూర్తి వివరాలను చూసేద్దాం.
కొచీ నుండి లక్షద్వీప్:
ఎంచక్కా టూర్ వేసి వచ్చేయచ్చు. కొచీ నుండి లక్షద్వీప్‌కు ప్రైవేటు క్రూయిజ్‌లు వున్నాయి. 14 గంటల నుండి 20 గంటల వరకు టూర్ కి పడుతుంది. వెళ్లాలనుకుంటే టికెట్స్ బుక్ చేసేసుకోండి.
ముంబాయి నుండి డుయి:
10 నుండి 12 గంటల సమమం పడుతుంది. చక్కగా టూర్ వేసొచ్చేయచ్చు. క్రూయిజ్‌లో సముద్ర వాతావరణాన్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఐలాండ్స్ ని కూడా మనం ఇలా చుట్టేయచ్చు.
వైజాగ్ నుండి చెన్నై, పుదుచ్చెరి, అండమాన్:
విశాఖపట్నం నుండి చెన్నై, పుదుచ్చెరి, అండమాన్ వెళ్ళచ్చు. చెన్నై, పుదుచ్చెరీలకు రెండు, మూడు రోజులు పడుతుంది. అండమాన్‌కు అయితే నాలుగు రోజులు పడుతుంది. ఇలా జర్నీ చెయ్యడం ఎంతో బాగుంటుంది. పైగా ఎప్పటికీ మరిచిపోలేరు కూడా. సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం… పబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ మొదలు ఎన్నో వాటిని లగ్జరీ క్రూయిజ్‌లో ట్రావెల్ చేసి పొంది.. సమయం గడపచ్చు.