తెలంగాణ కాశ్మీరం లో ఉన్న ఈ ప్రదేశాలని మీరు చూసారా..?

-

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో చూడడానికి ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. జలపాతాలు, ఎత్తైన కొండలు, అభయారణ్యాలు, కొండలను చీల్చుకుంటూ సాగే ఎత్తైన మహబూబ్‌, కెరిమెరి ఘాట్స్‌ ప్రయాణం.. వాహ్ ఒకటా రెండా ఎన్నో ప్రదేశాలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఒక్కసారి వీటిని చూశారంటే జీవితాంతం మరచిపోలేని జ్ణాపకంలా మారిపోతుంది. అయితే తెలంగాణ కశ్మీరంగా పిలువబడే ఈ ప్రదేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. స్వరాష్ట్రం లో నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు పాత, కొత్త జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించడంతో పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది.

దీనితో ఈ ప్రదేశాలు కళకళ్ళాడుతున్నాయి. మరి చూడాల్సిన ప్రదేశాల గురించి చూస్తే… నిర్మల్‌ ప్రాంతం లో కొయ్య బొమ్మలని తయారు చేస్తారు. ఈ బొమ్మలు ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. వీటిని చూసి సరదాగా నచ్చినవి కొనుగోలు చేసి ఇళ్లల్లో అలంకరించుకోవడం చాల మందికి ఇష్టం. అలానే కండాల, కుంటాల, పొచ్చెర, వాస్తాపూర్‌ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అయితే వర్షాలు కూడా ఎక్కువగా పడడం తో జలపాతాలు మరెంత నిండుగా ఉండడంతో అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడకి వస్తున్నారు.

అంతే కాదండి కడెం జలాశయం, అందులో బోటింగ్‌, ఖానాపూర్‌ సదర్మాట్‌ ఆనికట్‌, జన్నారం జంతువుల పార్కు, జోడెఘాట్‌, నిర్మల్‌ గండి రామన్న హరితవనం, మూషిక జింకల పార్క్‌ వంటి వాటిని చూడడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా చదువుల తల్లిగా కొలిచే ఈ సర్వస్వతి ఆలయానికి కూడా పెద్ద సంఖ్య లో భక్తులు వస్తున్నారు.

.

 

Read more RELATED
Recommended to you

Latest news