‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’ నని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మేనల్లుడు డైమండ్ హర్బన్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, దృణæమూల్ కాంగ్రెస్ మధ్య రోజురోజుకు అగ్గి రాజుకుంటుంది. ఈ క్రమంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్న బీజేపీకి అభిషేక్ సంచలమైన సవాల్ విసిరారు. ‘ కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా.. అలాంటి చట్టాన్ని తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సవాల్ విసిరారు.
హ్యట్రిక్ కోసం మమత..
కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అభిషేక్ బెనర్జీ బీజేపీపై ధ్వసమెత్తారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబ సభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తెస్తే మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని, తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మూడోసారి అధికారంలోకి రావాలని మమతా ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు బీజేపీ బెంగాల్‌లో గులాబీ జెండా ఎగరేయాలని ఆశిస్తుంది.