భారీగా పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు..

-

ఏదైనా పండ‌గ వ‌స్తుందంటే సొంత ఊళ్ల‌కు ప‌రుగులు తీస్తారు. ప్ర‌స్తుతం ద‌స‌రా పండ‌గ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే జనాలంత సొంత ఊళ్ల‌కు ప‌రుగులు తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌స్సులు, రైళ్లు ర‌ద్దీగా ఏర్ప‌డ‌తాయి. రైల్వే స్టేషన్లనైతే ఇసుక వోస్తే రాలనంత మంది జనం ఉంటరు. అయితే దసరా పండుగ సందర్భంగా రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను రైల్వే అధికారులు పెంచేసారు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 రూపాయలను ఏకంగా రూ.30 రూపాయలకు పెంచేసారు.

ఈ శనివారం నుంచి అక్టోబర్ 10 వరకు ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ.30కు విక్రయించనుంది. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని కిక్కిరిసిపోవడం ఖాయం కావడంతో ప్లాట్ ఫాంపై రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news