బ్రేకింగ్‌: ఏపీలో నూత‌న మ‌ద్యం పాల‌సీకి ముహూర్తం ఫిక్స్‌

-

అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తున్నామని ఎక్సైస్‌ మంత్రి నారాయణస్వామి తెలిపారు. శనివారం ఉదయం ఎక్సైస్‌ మంత్రి నారాయణస్వామి విలేకరులతో మాట్లాడుతూ… మద్యం వల్ల అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప్రజాసంకల్ప యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా మద్యనిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.

రాష్ర్టంలోని 3500 షాపులు నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. . ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. బార్ షాపుల సమయాలు కుదించనున్నామని మంత్రి చెప్పారు.

దశలవారీగా మద్య నిషేదానికి అంతా సహకరించాలని కోరారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్స్ పంపించామన్నారు. ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైస్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. బెల్టు షాపులు పెట్టకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news