హుజూర్‌న‌గ‌ర్లో ఫిక్సింగ్ పాలిటిక్స్‌

-

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలపడకుండా ఉండడానికి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ప్లాన్లు వేశారు. 2014 ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ముందుగా టీడీపీ ఖేల్ ఖ‌తం చేసే వ‌ర‌కు కేసీఆర్ వేయ‌ని ఎత్తు లేదు… పార‌ని పాచిక లేదు. టీడీపీ ఖేల్ ఖ‌తం అయ్యింది. ఇక 2018 ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి అన‌తి కాలంలోనే ఆయ‌న కాంగ్రెస్‌లో క‌ల్లోలం రేపారు. కాంగ్రెస్ పార్టీకి 19 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ల సంఖ్య ఇప్పుడు 6కు ప‌డిపోయింది. వ‌రుస పెట్టి నేత‌లు అంద‌రూ టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు.

ఇక దేశ‌వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్‌ను ఎలా ?  టార్గెట్ చేస్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్లో ఇప్పుడు ఈ రెండు పార్టీల ఉమ్మ‌డి శ‌త్రువు టీఆర్ఎస్‌గా క‌నిపిస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్లో ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకుంటున్న‌ట్టు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే మొదట శ్రీకళారెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆమె ఇటీవలే బీజేపీలో చేరారు.

బీజేపీలోని సీనియర్లకు సైతం చెప్పకుండా ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం దుమారం రేపింది. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసేందుకు చాలా మంది బ‌ల‌మైన నేత‌లు క్యూలో ఉన్నా శ్రీకళారెడ్డి పేరు తెరపైకి రావడం పార్టీలో చిచ్చుపెట్టింది. దీనిపై నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చివ‌ర‌కు పార్టీ అభ్య‌ర్థి ఆమె కాద‌ని బీజేపీ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఇప్ప‌ట‌కీ అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి ఎవ‌రో తెలియ‌ని ప‌రిస్థితి.

ఇక అస‌లు విష‌యానికి వస్తే ఇక్క‌డ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీఆర్ఎస్ గెల‌వ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన బీజేపీ సైతం ఇక్క‌డ త‌మ‌కు బ‌లం లేద‌ని డిసైడ్ అయ్యి… హుజూర్‌న‌గ‌ర్ వ‌ర‌కు కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేసేలా తెర‌వెన‌క పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు. కాంగ్రెస్ నేతల కనుసైగల్లోనే  బలహీన అభ్యర్థి అయిన శ్రీకళారెడ్డి పేరును తీసుకొచ్చారని.. కాంగ్రెస్ నేతలే బీజేపీలో టికెట్ల వ్యవహారం నడుపుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌, బీజేపీల‌కు ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్క‌డ మెయిన్ టార్గెట్ అయ్యింది. మ‌రి వీరి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు ఇక్క‌డ టీఆర్ఎస్‌ను ఓడిస్తాయా ?  లేదా కేసీఆర్ మ‌రోసారి ఇక్క‌డ గెలిచి స‌గ‌ర్వంగా గులాబీ జెండా ఎగ‌ర‌వేస్తాడా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news