హైదరాబాద్ నుంచి షిమ్లా, కులూమనాలీ టూర్ ప్యాకేజీ…ధర కూడా తక్కువే..!

-

వేసవిలో ఏదైనా చల్లటి ప్రాంతానికి వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ టూర్ ప్యాకేజీ గురించి చూడాల్సిందే. హైదరాబాద్ నుంచి షిమ్లా, కులు మనాలీ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించింది. షిమ్లా, కులు మనాలీ, చండీగఢ్ లాంటి పర్యాటక ప్రాంతాలకు ఈ టూర్ ప్యాకేజీ తో వెళ్లి వచ్చేయచ్చు. ఇక ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఫ్లైట్‌లో షిమ్లా, కులు మనాలీ, చండీగఢ్ లాంటి పర్యాటక ప్రాంతాలను చూడచ్చు. ఈ టూర్ మే 15న ప్రారంభమై మే 22న ముగుస్తుంది. ఇక ఈ టూర్ లో ఏ రోజు ఏం చూడచ్చు..?, ధర ఎంత..? వంటి వివరాలను కూడా తెలుసుకుందాం. హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ టూర్ ప్యాకేజీ పేరుతో దీనిని తీసుకొచ్చారు.

మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో 11.10 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.45 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ నుండి షిమ్లాకు బయల్దేరాలి. సాయంత్రం ది మాల్ చూడచ్చు. రాత్రి షిమ్లాలోనే స్టే చెయ్యాలి. అలానే రెండో రోజు ఉదయం కుఫ్రీ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి షిమ్లాలో స్టే చెయ్యాలి. మూడో రోజు ఉదయం మనాలీకి వెళ్ళచ్చు. దారిలో కులూ సందర్శించొచ్చు. రాత్రికి మనాలీలో స్టే చెయ్యాలి.

ఐదో రోజు మనాలీ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఆరో రోజు చండీగఢ్ బయల్దేరాలి. రోజంతా ప్రయాణం ఉంటుంది. రాత్రికి చండీగఢ్‌లో స్టే చెయ్యాలి. ఏడో రోజు రాక్ గార్డెన్, సుఖ్నా లేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి చండీగఢ్‌లో స్టే చేయాలి. ఎనిమిదో రోజు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 4.15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ వచ్చేయచ్చు. ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.35,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.37,950, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.52,200 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version