తిరుపతి ఫ్లైట్ టూర్.. వీటిని చుట్టేసి వచ్చేయండి..!

-

ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే చాలా టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. వీటితో ఎంచక్కా ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. తిరుపతికి వేర్వేరు టూర్ ప్యాకేజీలను ఇప్పటికే ఐఆర్‌సీటీసీ తీసుకు రావడం జరిగింది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో ఓ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, తిరుమల ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. ఇక మరిన్ని వివరాలు చూస్తే.. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది.

అలానే ఇది 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం, గురువారం ఈ ప్యాకేజీ మీకు అందుబాటులో ఉంటుంది. తిరుపతి ఫ్లైట్ టూర్ ఎలా సాగుతుందంటే.. మొదటి రోజు హైదరాబాద్‌లో ఇది ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2.05 గంటలకు తిరుపతి వెళ్లారు. విమానాశ్రయం నుంచి బయల్దేరి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ వెళ్ళాక రాత్రికి తిరుపతిలో స్టే చేయాలి.

రెండో రోజు ఉదయం తిరుమల. స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం అయ్యాక శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో దర్శనం పూర్తైన తర్వాత తిరుగు ప్రయాణం. రాత్రి 8.20 గంటలకు తిరుపతిలో బయల్దేరితే రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,550, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,645, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.16,330 పే చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news