ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌ను తగ్గించాలంటే సైబర్‌ బీమా ఉండాల్సిందేనా..?

-

ఇది డిజిటల్‌ కాలం. టెక్నాలజీ ఎంత వేగంగా పరుగుపెడుతుందో సైబర్‌ మోసాలు కూడా అంతే వేగంగా మన వెనక వస్తున్నాయి. ఏ రూపంలో అయినా సైబర్‌ నేరగాళ్లు మనల్ని మోసం చేసేందుకు రెడీగా ఉన్నారు. జీవితానకి భీమా ఉన్నట్లు.. సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. సైబర్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఏంటీ ఇన్సురెన్స్‌..?

డిజిటల్ పేమెంట్స్‌, ట్రాన్సాక్షన్స్‌ పెరుగుతున్నందున, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను పూర్తిగా నివారించడం మంచి ఆలోచన కాదు. సైబర్ థ్రెట్స్‌ రిలేటెడ్‌ రిస్కుల నుంచి సైబర్ ఇన్సూరెన్స్‌ ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. ఇలాంటి పాలసీలు కొంతకాలంగా కంపెనీలకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఇండివిడ్యువల్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చాయట. సైబర్ ఇన్సూరెన్స్ అనాథరైజ్డ్‌ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌, సోషల్ ఇంజనీరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్‌, ఆన్‌లైన్ థెఫ్ట్ సహా వివిధ ఎక్స్‌పోజర్‌లను కవర్ చేస్తుంది. కవరేజ్ వివిధ డిజిటల్ పేమెంట్స్‌ మోడ్స్‌కి విస్తరించవచ్చు, పొటెన్షియల్‌ లాసెస్‌ నుంచి ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ అందిస్తుంది.

ఇండివిడ్యువల్‌ సైబర్ ఇన్సూరెన్స్‌ పాలసీలు సాధారణంగా తక్కువ ధరకే కవరేజ్ ఆప్షన్‌లను అందిస్తున్నాయి.. ఉదాహరణకు రూ.10,000 హామీ మొత్తంతో UPI ఫ్రాడ్‌ కవరేజీకి కేవలం రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. ఇతర డిజిటల్ పేమెంట్‌ మోడ్స్‌ కవరేజీకి.. రూ.25,000 హామీ మొత్తం పొందాలంటే రూ.200 ప్రీమియం అవసరం కావచ్చు.

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్, ఇతర ఆన్‌లైన్ ఆఫర్‌లతో యాడ్-ఆన్ ప్రొడక్టులుగా అందుబాటులో ఉన్నాయి. సైబర్ థ్రెట్స్‌పై అవగాహన పెరుగుతూనే ఉన్నందున, సైబర్ ఇన్సూరెన్స్‌ అనేది కీలకమవుతుందని, ఇండివిడ్యువల్స్‌ తమ హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల తరహాలోనే దీన్ని కూడా పరిగణించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రెడిట్‌ కార్డులు వాడే వాళ్లు కూడా సైబర్‌ మోసాలపై అవగాహన ఉండాలి. క్రెడిట్‌ కార్డు లమిట్‌ పెంచుతాం అని బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నట్లు చేసి వారే మీ పేరు, మీ క్రెడిట్‌ కార్డు ఉన్న బ్యాంకు పేరు చెప్తారు. నిజమే అనుకోని సరే లిమిట్‌ పెంచేయండి అని వారు చెప్పింది చేశారంటే మీ అకౌంట్‌లో పైసలు మాయం. తెలియని లింక్స్‌పై క్లిక్‌ చేయడం కూడా డెంజరే. క్లిక్‌ చేస్తే ఏం అవుతుందిలే అనుకోవచ్చు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో గానీ.. ఒక్క క్లిక్‌ జేబూనైతే ఖాళీ చేస్తుంది.. మరీ.!

Read more RELATED
Recommended to you

Latest news