హైదరాబాద్ టు గోవా.. ఎంచక్కా ఈ ప్రదేశాలు చూడవచ్చు..!

-

ఎన్నో టూర్ ప్యాకేజీలని IRCTC తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో ఎంచక్కా ఈ ప్రదేశాలని చుట్టేసి వచ్చేయచ్చు. వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వస్తూనే వుంది. తాజాగా గోవా లోని పలు ప్రాంతాలను చూసేందుకు, టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో… పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 12వ తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

 

మొదటిరోజు మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కాలి. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు రీచ్ అవుతారు. అక్కడ నుండి హోటల్ కు వెళ్ళాలి. రాత్రి అక్కడ ఉండాలి. రెండో రోజు సౌత్ గోవాకు వెళ్ళాలి. ఓల్డ్ గోవా ని చూడవచ్చు. వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ ఉంటుంది. అలానే రాత్రి సౌత్ గోవాలోనే ఉండాలి. మూడో రోజు అయితే నార్త్ గోవా చూడచ్చు. కండోలియం బీచ్ కి వెళ్ళాలి. చపోరా ఫోర్ట్ కూడా చూడవచ్చు. రాత్రి అక్కడ బస చేస్తారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version