గుడ్ న్యూస్: చౌక ధరకే ఏసీ క్లాస్‌లో ప్రయాణం చెయ్యండి…!

-

ఏసీ కోచ్ లో తక్కువ ధరకే ప్రయాణం చెయ్యచ్చు అని ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇది కస్టమర్స్ కి అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు చౌక ధరలోనే ఏసీ క్లాస్‌లో ప్రయాణించే ఛాన్స్ ప్రయాణికులకు ఉంది. ఇక దీని కోసం అందుబాటు ధరలోనే ఏసీ క్లాస్‌లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడానికి రెడీ అవుతున్నారు.

ac three tier

దీని కోసం ప్రత్యేకమైన రైల్వే బోగీలను తయారు చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అయితే ఇప్పటికే వీటిని తయారు చేస్తున్నారు. వీటిని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన రైల్వే బోగీలను లక్నోకు పంపించారు. భద్రతకి సంబంధించి అక్కడ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇవి ప్రయాణికులకు అందుబాటు లోకి వస్తాయి. ఆర్‌డీఎస్‌వో త్వరలోనే ఈ ట్రైన్స్ కి అనుమతి ఇవ్వనుంది. సరికొత్తగా రూపొందించిన ఈ ఏసీ 3 టైర్ కోచ్‌ల లో ఫీచర్లు చాల బాగున్నాయి.

ఒక్కో బోగీలో 83 బెర్త్‌లు ఉంటాయి. అదే ఏసీ కోచ్ లో అయితే 72 బెర్త్‌లు ఉంటాయి. అలానే ప్రతీ బెర్త్‌కు తినడానికి వీలుగా ఒక టేబుల్ ఉంటుంది. చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటాయి. రీడింగ్ లైట్ మరియు పైన బెర్త్ ఎక్కడానికి స్టెయిర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా కొన్ని స్లీపర్ క్లాస్ బోగీలను కూడా ఏసీ 3 ఎకానమీ క్లాస్ బోగీలుగా మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ అనుకుంటోంది. దేనికి వలన ఆదాయం పెరుగుతుంది. అలానే ప్రయాణికులకు కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version