రూ.80 లక్షలు చెల్లిస్తే చాలు.. ఈ దీవి మీ సొంతం!

-

మీకు ప్రత్యేకమైన దీవి కావాలనుకుంటున్నారా? అయితే, మీరు స్కాట్‌లాండ్‌లోని ఈ దీవి రూ.80 లక్షలకే లభిస్తోంది. అయితే, ఇది వేలం పాటలో ప్రకటించిన కనీస విలువ. అసలు ఈ దీవిని ఎందుకు కొనుగొలు చేయాలో చూద్దాం. మీ సొంత దీవిలో హాయిగా సేద తీరుతూ.. మీ దీవి చుట్టూ నీరు, ఆ మధ్యంలో మీరు చెబుతుంటేనే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. దీనికి మీ వద్ద బిలియన్స్‌ ఉండాల్సిన పనిలేదు. ఇది ఎక్కడ ఉందంటే స్కాట్‌టాండ్‌లో ఉంది. ఈ దీవిని మీ స్వంతం చేసుకోవాలంటే
ఒక డుప్లెక్స్‌ ఇల్లు కొనేందుకు ఖర్చు పెడితే చాలు.


స్కాటిష్‌ హైలాండ్‌లోని లోచ్‌ మొయిడార్ట్‌ నడుమ గల 11 ఎకరాల ప్రైవేట్‌ ఐలాండ్‌ మొత్తాం కేవలం 80 పౌండ్లకే (సుమారు రూ.80 లక్షలు) లభిస్తుంది. డీర్‌ ఐలాండ్‌గా పేరున్న ఈ దీవిని ఈలీన్‌ ఏన్‌ ఎఫెయిద్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. కనీస సదుపాయాలు కూడా లేవు. అయితే, ఫ్యూచర్‌ ప్రాపర్టీ ఆక్ష న్స్‌ అనే సంస్థ మాత్రం.. దీన్ని మీరు ఇప్పుడు సొంతం చేసుకోకపోతే.. మరెప్పటికీ దక్కదని ప్రచారం చేస్తోంది. ఈ దీవిలో మీ ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించరని ఏజెంట్లు అంటున్నారు. పైగా..

ఇది రిచర్డ్‌ బ్రాన్సన్‌ అనే బిలీనియర్‌ సోదరి వెనెస్సా బ్రాన్స న్స్‌ కు చెందిన దీవి పక్కనే ఉందట. ఈ ఐలాండ్‌.. మొయిడార్ట్‌ రాజవంశానికి చెందిన క్లారానాల్డ్‌ ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం దీనికి యజమానులు ఎవరూ లేకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న జరిగే వేలంలో దీని విలువను రూ.80 లక్షలుగా నిర్ణయించారు. మరి, ఇంత పెద్ద దీవిని రూ.80 లక్షలకే సామాన్యుడి చేతికి దక్కడం సందేహమే. ఎందుకంటే.. ఇలాంటి దీవులను తమ ఆధీనంలో ఉంచుకోడానికి బిలినీయర్లు ఎంతకైనా ఖర్చుపెడతారు. ఏది ఏమైనా ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పండి. మీరు ఈ దీవిని చూడాలనుకుంటే గూగుల్‌ మ్యాప్‌లోకి Castle tioramఅని టైప్‌ చేసి, సెర్చ్‌ చేయండి. ఈ దీవికి సంబంధించిన ఫోటోలను చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ దీవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?

Read more RELATED
Recommended to you

Latest news