రైల్లో ప్రయాణం చేస్తున్నారా?ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి…

-

దూర ప్రయాణాలు చెయ్యడానికి బెస్ట్ ట్రైన్ జర్నీ..తక్కువ ఖర్చుతో, సుఖవంతమైన ప్రయాణం చెయ్యొచ్చు. అందుకే ఎక్కువ మంది రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా రైల్వే శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొని వచ్చింది.రైల్వే ప్రయాణం చేసేవారు లేదా లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకునేవారు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాలి..

*. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా జర్నీని కొనసాగించడం కోసం ఈ రూల్స్ రూపొందించింది ప్రభుత్వం. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసేవారికి ఈ నియమనిబంధనలు ఎక్కువగా వర్తిస్తాయి. కొత్త గైడ్‌లైన్స్ పాటించకపోతే రైల్వే ప్రయాణికులు చిక్కుల్లో పడకతప్పదు..

*. రాత్రి 10 గంటల తర్వాత ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ ప్రయాణికుల రైలు టికెట్లను తనిఖీ చేయకూడదు. అయితే ఎవరైనా రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కితే ఈ రూల్ వర్తించదు. టీటీఈ వారి టికెట్లను చెక్ చేయొచ్చు. మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారి బెర్త్‌లో నిద్రపోవచ్చు..

*. ఎవరైనా ప్రయాణికులు వారి ట్రైన్ మిస్ అయితే వారి సీట్లను లేదా బెర్త్‌లను టీటీఈ ఇతరులకు కేటాయించవచ్చు. అయితే సదరు ప్రయాణికులు వారి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కకపోతే ఓ గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటిన తర్వాత, వీటిలో ఏది ముందు అయితే దాని ప్రకారం టీటీఈ ఇతరులకు సీట్లను కేటాయిస్తారు..

*. ఇకపోతే ప్రయాణికులకు బెర్త్‌లో కలుగుతున్న ఇబ్బందుల్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరిన్ని రూల్స్ ప్రకటించింది. బెర్త్‌లో లేదా కోచ్‌లో ప్రయాణికులు ఎవరూ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు. హై వాల్యూమ్‌తో పాటలు వినకూడదు. ఇతర ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధుల సౌలభ్యం కోసం ఈ కొత్త రూల్ అమలు చేస్తోంది రైల్వే..

*. కొందరు ప్రయాణికులు తమ కోచ్‌లలో పాటలు వింటూ, బిగ్గరగా మాట్లాడుతున్నట్లు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుండటంపై రైల్వేకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రయాణికులు మాత్రమే కాదు రైల్వే ఎస్కార్ట్, మెయింటెనెన్స్ సిబ్బంది కూడా బిగ్గరగా మాట్లాడుతున్నారని రైల్వేకు ఫిర్యాదులు వచ్చాయి. అందుకే రైల్వే కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు..

*. తరచుగా రాత్రి 10 గంటల తర్వాత తమ లైట్లను ఆన్ చేసి, ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలిగిస్తున్నారు. ఇలా కొందరి ప్రయాణికుల తీరు వల్ల మిగతా ప్యాసింజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రయాణికులు పాటించాల్సిన కొత్త రూల్స్ ప్రకటించింది రైల్వే. ఈ రూల్స్ పాటించకపోతే చిక్కులు ఎదుర్కోక తప్పదు..ఏది ఏమైనా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే మనకు చాలా మంచిది..ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news