Ujjwala Yojana : ఫ్రీగా వంటగ్యాస్ సిలిండర్, స్టవ్.. రూ. 300 సబ్సిడీ కూడా.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

-

అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములని తీసుకొచ్చింది. మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, నిరుద్యోగులు ఇలా అందరి కోసం కొన్ని పథకాలను తీసుకు వస్తోంది. వారికి అనుకూలంగా పలు ప్రయోజనాలను అందిస్తోంది. మహిళల పేరిట ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ స్కీము కింద గ్యాస్ సిలిండర్, స్టవ్ ఉచితంగా పొందవచ్చు. వీటిపై సబ్సిడీ కూడా ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్. ఏడాదికి 12 సిలిండర్ల వరకు 300 చొప్పున రాయితీ కూడా అందిస్తోంది. ఇప్పటికే ఈ స్కీం కింద పది కోట్ల 33 లక్షల పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి.

కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించేసింది. రాఖీ బహుమతి కింద వంద చొప్పున తగ్గించగా.. అదే సమయంలో ఉజ్వల స్కీం కింద రాయితీని 200 నుంచి 300 కు పెంచింది. కొత్తగా ఈ స్కీమ్ కి రానున్న మూడేళ్లలో 75 లక్షల వరకు కొత్త కనెక్షన్స్ ఇస్తామని తెలిపింది. ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా వంద తగ్గించింది. ఉజ్వల పథకం 2016 మే1న ఉత్తర ప్రదేశ్ లో మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికంగా వెనుకబడిన వాళ్లకి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి, మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. 18 ఏళ్లు దాటితే సరిపోతుంది ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం లక్షలోపు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పటిదాకా గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు. అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉజ్వల స్కీం కింద మొదట స్టవ్ సిలిండర్ ఫ్రీగా వస్తాయి. తర్వాత నుంచి గ్యాస్ సిలిండర్ పై 300 సబ్సిడీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news