5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్లు వేస్తాం.!

-

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షనిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తాం.. సదుపాయాలు కల్పిస్తాం.

గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తాం. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నాం.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తాం. గ్రామం నుంచి సమీప ప్రాంతాల‌ అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్ ప్లేస్ లు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌ముంది. కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో రానున్న రోజుల్లో పని చేయాలి. రాబోయే 5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం చేస్తాం అని ఏపీ సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news