పీఎఫ్ అకౌంట్‌ వుందా..? అయితే ఇలా లక్ష విత్ డ్రా చేసుకోవచ్చు…!

-

మీకు పీఎఫ్ అకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు కనుక డబ్బులు అవసరం అయితే గంటలో మీ పీఎఫ్ అకౌంట్ నుంచి రూ. లక్షను విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అడ్వాన్స్ పీఎఫ్ బ్యాలెన్స్ కింద మీ పీఎఫ్ అకౌంట్ నుండి లక్ష రూపాయలను విత్ డ్రా చేసుకునే అవకాశం వుంది.

అయితే ఈ డబ్బుని మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా ఏ సమయంలోనైనా దీనిని తీసుకోవడానికి అవుతుంది. అయితే ఈ డబ్బులను తీసుకునేటప్పుడు ఈ ఎమర్జెన్సీ అవసరాల కాస్ట్‌ను, హాస్పిటల్‌లో చేరినట్టు ప్రూఫ్‌లను పెట్టాలి. అప్పుడు ఆ డబ్బుని తీసుకోవడానికి అవుతుంది.

రూ.లక్షను మెడికల్ ఎమర్జన్సీ కింద ఉద్యోగులు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. కరోనా వైరస్ కాకుండా మరేదైనా మెడికల్ ఎమర్జెన్సీ కింద హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటే ఈ డబ్బులను డ్రా చేసుకోచ్చు. ఇది వరకు కూడా ఈ అవకాశం ఉండేది.

కానీ అప్పుడు మాత్రం మెడికల్ బిల్లులు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మీరు బిల్లులు చెల్లించాల్సినవసరం ఏమి లేదు. ఆసుపత్రిలో చేరగానే అప్లై చెయ్యచ్చు.

దీని కోసం ముందుగా www.epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
నెక్స్ట్ మీరు https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface Online Services Claim (Form 31,19,10C & 10D)కి వెళ్లాలి.
ఇప్పుడు మీరు బ్యాంకు అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.
ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి.
డ్రాప్ డౌన్‌లో పీఎఫ్ అడ్వాన్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
కారణం రాసి, ఎంత అమౌంట్ కావాలో కూడా రాయండి.
చెక్ స్కాన్డ్ కాపీని సమర్పించాలి.
మీ అడ్రస్‌ను నమోదు చేయాలి.
ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news