పాస్‌పోర్టుకు అప్లై చేస్తున్నారా ? ఏమేం డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోండి !

-

పాస్‌పోర్టు తీసుకోవాలంటే ఒక‌ప్పుడు అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్వాల్సి వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం ఆన్‌లైన్ విధానం ద్వారా చాలా సుల‌భంగానే పాస్‌పోర్టు తీసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేశాక స్లాట్ బుక్ చేసుకుని అదే రోజు పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి సంబంధిత ప‌త్రాల అస‌లు కాపీల‌ను చూపిస్తే చాలు, వెంట‌నే పాస్ పోర్టు జారీ అవుతుంది. త‌రువాత ప్రింట్ అయిన పాస్‌బుక్ వారం నుంచి 15 రోజుల్లోగా ఇంటికి వ‌స్తుంది.

అయితే పాస్‌పోర్టుకు అప్లై చేసేందుకు ఏమేం ప‌త్రాలు కావాలో ముందుగా తెలుసుకోవాలి. అవేమిటంటే…

అడ్ర‌స్ ప్రూఫ్ కోసం కింద తెలిపిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

* ఆధార్ కార్డ్
* ఎల‌క్ట్రిసిటీ బిల్
* గ్యాస్ క‌నెక్ష‌న్ ప్రూఫ్
* టెలిఫోన్ బిల్ (పోస్ట్‌పెయిడ్ మొబైల్‌ లేదా ల్యాండ్‌లైన్‌)
* వాట‌ర్ బిల్
* రెంట‌ల్ అగ్రిమెంట్
* యాక్టివ్‌లో ఉన్న, ర‌న్నింగ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీ
* భ‌ర్త లేదా భార్యకు చెందిన పాస్‌పోర్టు కాపీ (పాస్‌పోర్టు మొద‌టి, చివ‌రి పేజీల్లో కుటుంబ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు దారు పేరు ఉండాలి)

పుట్టిన తేదీ ధ్రువీక‌ర‌ణ‌కు కింది ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

* బ‌ర్త్ స‌ర్టిఫికెట్ (రిజిస్ట్రార్ ఆఫ్ బ‌ర్త్స్ లేదా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లేదా గ్రామ పంచాయ‌తీ మంజూరు చేసింది అయి ఉండాలి)
* మెట్రిక్యులేష‌న్ లేదా స్కూల్ లీవింగ్ స‌ర్టిఫికెట్ (ఎడ్యుకేష‌న‌ల్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన స్కూల్ మంజూరు చేసింది అయి ఉండాలి)
* పాన్ కార్డు
* ఆధార్ కార్డ్ లేదా ఇ-ఆధార్ కార్డ్
* ప్ర‌భుత్వ ర‌వాణా విభాగం మంజూరు చేసిన డ్రైవింగ్ లైసెన్స్
* ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఓట‌ర్ ఐడీ కార్డు
* అభ్య‌ర్థి పేరిట ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ కాపీ

అభ్య‌ర్థి స‌మ‌ర్పించే ప‌త్రాల‌పై అభ్య‌ర్థి పేరు, పుట్టిన తేదీ త‌దితర వివ‌రాల‌న్నీ ఉండాలి. స్లాట్ బుక్ చేశాక పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లిన‌ప్పుడు ఒరిజిన‌ల్ ప‌త్రాల‌ను చూపించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version