ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

-

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. 10 రోజుల లాక్‌డౌన్‌ ఉన్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఆకస్మికంగా పెట్టడంతో కొంతమంది తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌తో బాధపడుతున్న అత్యవసర సేవలు పొందాల్సిన వారికి ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. బార్డర్ల వద్ద పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, తెలంగాణకు రావాలంటే కచ్చితంగా ఈ పాస్‌ తీసుకోవాలని ప్రకటించింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇది చాలా ముఖ్యం. ఇది సైబరాబాద్, హైదరాబాద్, రా^è కొండ పోలీసుల పరిధిలో జారీ చేస్తారు.

అత్యవసర సేవలకే ఈ–పాస్‌

డీజీపీ వివరాల ప్రకారం లాక్‌డౌన్‌ సమయంలో ఇతర ప్రాంతాలకు అత్యవసర సేవల కోసం వెళ్లేవారికే ఈ పాస్‌ జారీ చేస్తారు. అలాగే, ఒకరికి కూడా ఎస్పీల ఆధ్వర్యంలో ఈపాస్‌లు ఇవ్వనున్నారు.

తెలంగాణకు వచ్చేవారికి పాస్‌ కంపల్సరీ

తెలంగాణకు వచ్చేవారు కచ్చితంగా ఈపాస్‌ కలిగి ఉండాలని తెలంగాణ డీజీపీ చెప్పారు. ఉదాహరణకు కేరళ నుంచి ఎవరైనా తెలంగాణకు రావాల్సి వస్తే వారు కేరళ నుంచే ఈ పాస్‌ పొంది ఉండాలి.

కొద్ది సమయంలోనే వేల రిక్వేస్ట్‌లు

హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఈ పాస్‌ వివరాలను తెలిపిన కొద్ది సమయంలోనే 7 వేల దరఖాస్తులకు రిక్వేస్ట్‌లు వచ్చాయి.

మినహాయింపులు

మెడికల్‌ సర్వీసస్, ప్రెస్, అత్యవసర సేవలకు ఈపాస్‌ అవసరం లేదని తెలిపారు. వీటికి మినహాయింపు లభించింది. ఒకవేళ పేషంట్‌ కేర్‌టేకర్‌ ప్రయాణించాల్సి వస్తే పేషంట్స్‌ అటెండెంట్‌ పాస్, డాక్టర్‌ ప్రెస్కిప్షన్‌ ఉంటేనే అనుమతిస్తారు. అలాగే అత్యవసర సేవలు..ఆహార ధాన్యాలు, ఫుడ్‌ ఐటమ్స్, నిర్మాణ సామగ్రి, ఫర్టిలైజర్స్, విత్తనాలు ఇతర సేవలకు మినహాయింపు ఉంది.
ఏ4 సైజ్‌ పేపర్‌ను మీ సేవల వివరాలతో వెహికల్‌ స్క్రీన్‌కు అతికించడం వల్ల సులభతరం అవుతుందని సీపీ తెలిపారు. వారు అన్ని వివరాలను పేపర్‌పై నమోదు చేయాలని తెలిపారు.

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. 10 రోజుల లాక్‌డౌన్‌ ఉన్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఆకస్మికంగా పెట్టడంతో కొంతమంది తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌తో బాధపడుతున్న అత్యవసర సేవలు పొందాల్సిన వారికి ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. బార్డర్ల వద్ద పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, తెలంగాణకు రావాలంటే కచ్చితంగా ఈ పాస్‌ తీసుకోవాలని ప్రకటించింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇది చాలా ముఖ్యం. ఇది సైబరాబాద్, హైదరాబాద్, రా^è కొండ పోలీసుల పరిధిలో జారీ చేస్తారు.

ఈ–పాస్‌ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

పోలీసుల వెబ్‌పోర్టల్‌ లింక్‌ https://policeportal.tspolice.gov.in/website వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ మహెందర్‌ రెడ్డి తెలిపారు.

టికెట్స్‌ కచ్చితం

ఈపాస్‌ ద్వారా ప్రయాణించే వారు బస్, ట్రైన్, ఫ్లైట్‌ టికెట్‌ను కచ్చితంగా పెట్టుకోవాలన్నారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు బస్, మెట్రో సేవలు కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news