ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే కార్డు నెంబర్ మారుతుందా?

-

ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డుగా ప్రభుత్వం ఆధార్ కార్డును అందించింది.. ప్రతి ఒక్క పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరి.. మన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లలో ఇది కూడా ఒకటి..అయితే ఈ కార్డ్‌లో 12 అంకెలు చాలా ముఖ్యం. ఇందులో వ్యక్తి బయోమెట్రిక్, ఇతర పూర్తి వివరాలు ఉంటాయి..పేరు, చిరునామా, చేతుల వేలిముద్రలు, కళ్ల స్కానింగ్, ఛాయాచిత్రాలు వంటి ప్రధాన అంశాలు ఉంటాయి. ఆధార్ కార్డ్ డేటా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సురక్షితంగా ఉంచబడుతుంది..అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి..

ఎలా అప్డేట్ చేసుకోవాలి?

*. ఆధార్ కార్డ్‌లో బయోమెట్రిక్, జనాభా సమాచారం రెండింటినీ నవీకరించవచ్చు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి.

*. మీ సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ మీ ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోండి. uidai.gov.in వెబ్‌సైట్ నుంచి సమీప ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సమాచారాన్ని కనుగొనవచ్చు.

*. ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ కోసం మై ఆధార్ అప్‌డేట్ నుంచి వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా కూడా ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయవచ్చు.

మీరు ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసినా, ఆధార్ నంబర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఆధార్ కార్డ్ తయారు చేసే సమయంలో అందుకున్న ఆధార్ నంబర్, అప్‌డేట్ చేసిన తర్వాత కూడా అదే ఆధార్ నంబర్‌ కొనసాగుతుంది..

ఇకపోతే ఆధార్ కార్డు ఎక్కడికి వెళుతుందంటే..మీరు ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను మార్చకపోతే, మీ ఆధార్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌పై ఆధార్ నోటిఫికేషన్ వస్తుంది. మొబైల్ నంబర్ కూడా మార్చబడితే, మీ ఆధార్ కార్డ్ ఎక్కడ పంపిణీ చేయబడుతుందో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ ద్వారా పూర్తి సమాచారం అందుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version