క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎం లో డబ్బులు డ్రా చెయ్యచ్చు.. ఎలా అంటే..?

-

ఏటీఎం నుండి డబ్బులను డ్రా చెయ్యాలంటే కార్డు అవసరం అని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కార్డు లేకుండా కూడా డబ్బులని విత్ డ్రా చెయ్యచ్చు. చాలా బ్యాంకులు వాళ్ళ యొక్క యాప్స్ లో ఈ అదిరే ఫీచర్ ని ఉంచారు.

 

money
money

ఇప్పడు మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. దీనితో ఇక ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డులు, బ్యాంకింగ్ యాప్స్ కూడా అవసరం లేదు. ఏదైనా యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. సులువుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులని డ్రా చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఏటీఎం తయారీ సంస్థ అయిన ఎన్‌సీఆర్ కార్పొరేషన్ తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ ఇది. మన స్మార్ట్ ఫోన్ లో వుండే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ డ్రా చేసేయచ్చు. ప్రస్తుతం ఇది అన్ని ఏటీఎంలలో లేదు. రానున్న రోజుల్లో వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా రూ.5,000 మాత్రమే డ్రా చేయొచ్చు. ఇక డబ్బులు ఎలా పొందొచ్చు అనేది చూస్తే..

ముందుగా ఏటీఎం సెంటర్‌లో స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
ఇపుడు మీ ఫోన్ లో వుండే గూగుల్ పే, పేటీఎం, భీమ్, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ఓపెన్ చేయాలి.
ఏటీఎం స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
తర్వాత మీరు ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసి.. తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన డబ్బులు డ్రా అవుతాయి.

బ్యాంకింగ్ యాప్ ద్వారా ఇలా డబ్బులు డ్రా చేయండి:

మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఎంచుకోవాలి.
అమౌంట్ ఎంటర్ చేయాలి. పిన్ జనరేట్ చేయాలి.
ఆ తర్వాత సొంత బ్యాంక్ ఏటీఎంకు వెళ్లాలి.
ఏటీఎంలో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
పిన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి డబ్బుల్ని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news