ఓటరు లిస్టులో పేరు లేకున్న ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు…

చాలామంది తమ దగ్గర ఓటర్ ఐడీ లేదని.. ఓటెలా వేయాలని టెన్షన్ పడుతుంటారు. ఓటర్ ఐడీ లేకపోతే ఇక ఓటేయలేమని అనుకుంటారు. అటువంటి వాళ్లు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీ దగ్గర ఓటర్ ఐడీ లేకపోయినా ఓటేయవచ్చు. కాకపోతే మీ దగ్గర ఎన్నికల కమిషన్ ఒప్పుకునే ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలు. అవి ఏంటంటే..You can vote even without having Voter ID

 

1. ఆధార్ కార్డు

2. పాస్ పోర్ట్

    3. డ్రైవింగ్ లైసెన్స్

4. పాన్ కార్డ్

5. ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫోటో ఓటర్ స్లిప్

6. ఆరోగ్య బీమాకు సంబంధించిన స్మార్ట్ కార్డ్(కార్మిక శాఖ జారీ)

7. పింఛనుకు చెందిన డాక్యుమెంట్(ఫోటో ఉండాలి)

8. ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు

9. బ్యాంకు పాస్ బుక్(ఫోటోతో సహా)

10. పోస్టాఫీసు పాస్ బుక్

11. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయి ఐడీ కార్డు

వీటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా ఓటు వేయొచ్చు.

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి