కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా దాచుకున్న ఏటీఎం కార్డు పోతుంది. బ్యాంకు లావాదేవీల కోసం ఏటీఎం కార్డు మనకి చాలా అవసరం. ఒకవేళ కనుక ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏటీఎం కార్డు కనుక మిస్ అయింది అంటే బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోయే అవకాశం ఉంది. అయితే ఏటీఎం కార్డు పోయిన తర్వాత ఏం చేయాలి..?, ఎలా బ్లాక్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఎప్పుడైనా ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి. స్టేట్ బ్యాంక్ లో మీకు ఖాతా ఉండి ఉంటే స్టేట్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్ 1800123 నెంబర్ కి డయల్ చేయాలి. ఆ తర్వాత అక్కడ చెబుతున్న విధంగా మీరు నెంబర్స్ ని ప్రెస్ చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలంటే సున్నా నొక్కండి ఇలాంటివి వస్తూ ఉంటాయి.
ఈ విధంగా మీరు ఫాలో అయిపోవాలి. మీది ఎస్బీఐ ఏటిఎం కార్డు అయితే ఇలా సులభంగా బ్లాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లి కానీ ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మీ బ్యాంక్ బట్టి మీరు టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేసుకుని ఈజీగా మీ యొక్క ఏటీఎం కార్డు బ్లాక్ చేయండి. ఏటీఎం కార్డు అదే కనిపిస్తుందిలే అని మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నా మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కావాలి అయిపోతాయి అని గుర్తుంచుకోండి.