యోధుని కన్న అమ్మా.. నీకు నీరాజనం..

-

వీరులను కన్న నేల మనది, వీరుల తీర్చిదిద్దిన అమ్మలున్న జాతి మనది.. అలాంటి వీరుడిని కన్న తల్లిని ఈ మదర్స్‌డే సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ అందరికీ మనలోకం మదర్స్‌ డే శుభాకాంక్షలు..

అర్థ రాత్రి గుర్రపు డెక్కల చప్పుకి ఉలిక్కి పడి లేచిందాపాప.. ఏం జరుగుతుందో చూసేందుకు కిటికీని తెరిచింది. కొందరు దుండగులు ఆ పాప ఇంటి పక్కనున్న శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పరుగున వెళ్ళి తండ్రిని నిద్ర లేపి, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని, వెళ్ళి అడ్డుకొమ్మని కోరింది. ఆ తండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మెఘలుల ఆధీనంలో ఉన్నామని, వారిని అడ్డుకోవడం కష్టమని చెప్పాడు. తండ్రిని అలా చూస్తూ కంటనుండి కారుతున్న కన్నీరును తుడుచుకుంటూ కోపంగా ఆ దుండగుల వైపు చూస్తూ ఉండి పోయింది.

రోజులు నెలలై, నెలలు సంవత్సరాలై గడచి ఆ పాప పెద్దదైంది. పెళ్లి జరిగిందామెకు. ఒకరోజు అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చున్న ఆమెకు మరో దుస్సంఘటన కన్పించింది. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు కొందరు. ఒక్కసారిగి చిన్ననాడు తను చూసిన సంఘటన మళ్ళీ తనముందు పునరావృతం అవ్వడంతో కోపంతో రగిలిపోయిన ఆమె ఒక్కొక్కరిని చంపెయ్యాలన్నంతగా రగిలిపోయింది. తన భర్తను పిలిచి అడ్డుకోవాలని చెబుతుంది. దానికి ఆమె భర్త మనల్ని ఖిల్జిలు పరిపాలిస్తున్నారని, వారిని అడ్డుకోవడమంటే మరణం పొందడమే అంటూ చెప్తాడు. తండ్రి చెప్పిన సమాధానమే తన భర్తనోట రావడం తను జీర్ణించుకోలేకపోయింది. ఇలాంటి మాట మళ్ళీ తను వినకూడదనుకుంటుంది.

కొంత కాలనికి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాధలు పురాణాలు చెబుతూ వీరుల కథలు, చెడును సహించవద్దంటూ ఉగ్గుపాలతో నూరి పోస్తుంది. హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీలపట్ల గౌరవ మర్యాదలతో మెలగటం నేర్పిస్తుంది. యుద్ద విద్యలను నేర్పిస్తూ పెంచుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత తను ఏదైతే చూడకూడదనుకుందో మళ్ళీ అలాంటిఘటననే తనముందు జరుగుతుంది.

కొందరు దుండగులు స్త్రీలను బలాత్కరిస్తూ, నానా భీభత్సం సృష్టిస్తుంటారు. అది చూసిన ఆమె తన కొడుకును పిలుస్తున్న ఆమె పిలుపు పూర్తవకుండానే మెరుపు వేగంతో సింహగర్జన చేస్తూ దుండగులపై విజృంభించి భవానీమాతా వర ప్రసాదమైన ఖడ్గంతో ఒకేఒక్క దెబ్బతో శతశిరఛ్ఛేదనం గావిస్తాడు. స్వరాజ్య సామ్రాజ్యమే తన లక్ష్యం గా ధర్మ పరిరక్షణే తన ద్యేయంగా ప్రకటిస్తాడు. నవాబుల పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడా నూనూగు మీసాల పదిహేడు ఏళ్ళ యువకుడు.

ఆ తల్లి ఎవరో కాదు జిజియా భాయి ఆ వీరుడు మరెవరో కాదు శివాజీ భోంస్లే. తన పదిహేడవ ఏట ప్రారంభించిన ఉద్యమ పతాకాన్ని ఉవ్వెత్తున ఎగరవేస్తూ హిందూ ధర్మన్ని కాపాడే యోధుడుగా నిలిచాడు. అలుపెరగని పోరాటాలు చేసి దాదాపుగా మొఘలుల పాలనకు స్వస్తి చెప్పి మరాఠ దేశంలో అన్ని ప్రాంతాలనూ కోటలనూ కైవసం చేసుకుని
, ధర్మాన్ని నాలుగు పాదాలపై మొహరింపజేసి యావధ్బారతావనీ జయహో ఛత్రపతి అనే విధంగా పరిపాలన సాగించి అజరామర కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకున్న మరాఠా వీరుడు చత్రపతి శివాజీ మహరాజ్‌..

 

Read more RELATED
Recommended to you

Latest news