ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2014-19 వరకు ఒక్క మహిళా కూడా మంత్రి వర్గంలో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరూ మహిళలు మంత్రులుగా వరంగల్ నుంచి ఉన్నారని తెలిపారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే.. కొండను బద్దలు కొట్టింది కూడా ఆడబిడ్డనే అన్నారు.
కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసుకొని ఇందిరమ్మ జయంతి రోజు ఇవాళ ప్రారంభించుకున్నామని తెలిపారు. చేయరు.. చేసిన వారిని చేయనియ్యరని పేర్కొన్నారు. కాకతీయులు కట్టిన గొలుసు కట్టు చెరువులు ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ప్రత్యేక తెలంగాణలో చంద్రశేఖర్ రావు చేతిలో మోసపోయి ఘోస పడుతుందని అద్భుతం చేయాలనే ఆలోచన చేశామని తెలిపారు. వరంగల్ పట్టణాన్ని నగరంగా అభివృద్ధి చేయాలని పలుమార్లు సూచించారు. వరంగల్ హైదరాబాద్ తో పోటీ పడాలని పొంగులేటికి ఆదేశాలు ఇచ్చాను. వరంగల్ అభివృద్ధికి ఇన్ చార్జీ మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు, మంత్రులు కీలక బాధ్యతలు చేపట్టారు.