ప్రతీ నెల తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం రూ.18,500 కోట్లు. జీతాలు పెన్షన్లు, అప్పులు కడితే.. మిగిలిన 5వేల కోట్లు ఉంటే.. రూపాయి రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేశాం. రైతులకు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తుండు.. మాకు మిగులతది అని కేసీఆర్ అనుకుంటుండు. ఇద్దరూ అచ్చొచ్చినోళ్ల లెక్క వదిలి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కేటీఆర్ ముందు రోజు.. రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
పది నెలల్లో ఏమి కోల్పోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలివిగల ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. రూ.2లక్షల రుణమాఫీ చేశాం. పదేళ్లలో చేయనిది 10 నెలల్లో చేసి చూపించామన్నారు. వరి ధాన్య ఉత్పత్తిలో ప్రపంచ రికార్డు సాధించామని తెలిపారు. అన్ని అంశాలపై చర్చించడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు.