కరోనా మహమ్మారి దేశంలోని అన్ని రంగాల వారిని తీవ్రంగా నష్టానికి గురి చేసింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ వైరస్ వల్ల నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఇక లాక్‌డౌన్ 4.0 లో భాగంగా అనేక ఆంక్షలకు సడలింపులు కూడా ఇస్తున్నారు. అలాగే అటు రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. మరోవైపు ఆర్‌బీఐ కూడా ఆర్థిక ఉద్దీపనలను ప్రకటిస్తోంది. అయితే కరోనా వల్ల కుదేలైన వినోద రంగం మాత్రం ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.
దేశంలో అన్ని కార్యకలాపాలకు దాదాపుగా అనుమతిచ్చినా టీవీ, చిత్ర పరిశ్రమలకు మాత్రం ఇంకా ఊరట లభించలేదు. ఆయా రంగాలకు చెందిన ఎంతో మంది కార్మికులు ఇప్పుడు తమకు ఆంక్షల సడలింపు ఎప్పుడు ఉంటుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వాటితో సంబంధం లేకుండా అటు స్టార్ మా టీవీ మాత్రం బిగ్‌బాస్ సీజన్ 4కు రెడీ అవుతున్నట్లు తెలిసింది. కరోనా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే బిగ్‌బాస్ షోను ప్రారంభించాలని అనుకుంటున్నారట.
ప్రతి ఏడాది స్టార్ మా జూలై మొదటి వారంలోనే బిగ్‌బాస్ షోను ప్రారంభించింది. కానీ ఈసారి కరోనా కారణంగా అసలు ఆ షో జరుగుతుందా, లేదా అని అందరూ అనుకుంటుంటుండా.. స్టార్ మా మాత్రం షోను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ సారి సీజన్‌కు ఆ టీవీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇక షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించారట. అందులో భాగంగా ఇప్పటికే తరుణ్, వర్షిణి, మంగ్లీ, అఖిల్ సర్తాక్ తదితర సెలబ్రిటీలను ఈసారి షోకు తీసుకున్నట్లు తెలిసింది. ఇక షోకు సంబంధించి బిగ్‌బాస్ హౌజ్ సెట్‌ను ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ షో గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.