దేశ‌వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్‌.. భారీగా పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు..

-

భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) దేశ‌వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. వేస‌వికాలం వ‌ల్ల రానున్న 3-4 రోజుల్లో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెర‌గ‌డ‌మే కాకుంగా, తీవ్ర‌మైన వేడి గాలులు వీస్తాయ‌ని తెలిపింది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయిన‌, సాధార‌ణ వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

high temperatures and heatwaves may occur in few parts of india says imd

దేశంలోని ఉత్త‌ర భాగంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, చండీగ‌డ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో మ‌రో 2 – 3 రోజుల పాటు ఉష్ణోగ్ర‌త‌లు 45 డిగ్రీలు దాటుతాయ‌ని, తీవ్ర‌మైన వేడి గాలులు వీస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. అలాగే చ‌త్తీస్‌గ‌డ్‌, ఒడిశా, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, విద‌ర్భ‌, ఏపీ, యానాం, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల‌లో ఉష్ణోగ్ర‌త‌లు 45 నుంచి 47 డిగ్రీల వ‌ర‌కు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ఈ ప్రాంతాల్లోనూ తీవ్ర‌మైన వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అందువ‌ల్ల ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని అధికారులు సూచిస్తున్నారు.

అయితే మే 28వ తేదీ త‌రువాత దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసి వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news